100 రోజులు 150 సెంటర్స్ లో ఒక సినిమా ఆడింది అంటే మాములు విషయం కాదు. అది కూడా ఒక కుర్ర హీరో సినిమా ఆడింది అంటే అది హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోవడం గ్యారెంటీ. ఆ హిస్టరీని ౧౯ ఏళ్లకే క్రియేట్ చేసాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ, తెలుగు సినిమ ముందెన్నడూ చూడని హీరో వర్షిప్ ని చూపిస్తూ బయటకి వచ్చిన…
ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది, ఇంకో ఏడాది వరకూ ఎన్టీఆర్ సినిమా థియేటర్ లో కనిపించదు. 2024 ఏప్రిల్ కి కొరటాల శివ, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా రిలీజ్ కి షెడ్యూల్ అయి ఉంది. ఈ గ్యాప్ లో 2023 మే 20కి ఎన్టీఆర్ ‘వస్తున్నాడు’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ మాస్ హీరోగా మార్చిన సినిమా ‘సింహాద్రి’.…