Manmohan Singh: భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 2024, డిసెంబర్ 26న 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన సేవలను స్మరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని నిర్ణయించింది. ఈ సమాచారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా వెల్లడైంది. మాజీ ప్రధాని స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. హోం మంత్రిత్వ శాఖ తమ…