సిద్ధిపేట జిల్లా కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవ వేడుకలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిద్ధిపేటకు కేంద్రీయ విద్యాలయం అనేది నా పదేళ్ల ప్రయత్నం 2018లో ఫలించిందని ఆయన అన్నారు. సిద్ధిపేటకు కేంద్రీయ విద్యాలయం నా కల నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. రూ.24 కోట్ల రూపాయల వ్యయంతో ఏన్సాన్‌పల్లిలో కేంద్రీయ విద్యాలయం కోసం నూతన భవన నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. యూపీఏ ప్రభుత్వం…