పేదరికం కారణంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆర్యన్ రోషన్ గురించి వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ స్పందించారు. శుక్రవారం నాడు ఆ విద్యార్థిని కలెక్టరేట్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ మను చౌదరి పిలిపించారు. ఐఐటీ తిరుపతిలో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో సీటు పొందిన ఆర్యన్ రోషన్‌కు సెమిస్టర్ ఫీజు నిమిత్తం రూ.36,750 చెక్కును అందజేశారు. అలాగే చదువు అవసరాల నిమిత్తం రూ. 40,500 విలువైన ల్యాప్ టాప్‌ను కూడా కొనిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి ఏర్పాటు చేసిన సభకు హాజరైన నేపథ్యంలో, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మార్చి 7 ఆదివారం నాడు సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ సిబ్బందితో కలిసి వెంకట్రామిరెడ్డి ఓ సభను ఏర్పాటు చేసారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు,…