ఇటీవలి కాలంలో అందరిచే ఆదరణ పొందుతున్న సిద్ధ వైద్యానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటరీని సీడీ రూపంలో రూపొందించారు దర్శకుడు యమునా కిషోర్. సిద్ధ వైద్యంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన డా. శ్రీమతి సత్య సింధూజ గారి ద్వారా ఈ విశేషాలను ప్రజలకు అందించారు. సిద్ధ వైద్యానికి సంబంధించిన ఈ సీడీ ఆవిష్కరణకు చెన్నై నుంచి ప్రఖ్యాత తార శోభన గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, స్వయంగా ఆవిష్కరించారు. సిద్ధ వైద్యం గొప్పతనం, అది ప్రజలకు ఏ…