పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుపాకీతో కాల్చుకొని సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఈ రోజు చోటుచేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా పని పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి.. ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. అయితే, ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయన.. తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు.