Shubman Gill: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో రెండో రోజు గిల్ తన టెస్ట్ కెరీర్ లోనే మొట్టమొదటి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఇలా టెస్ట్ ఫార్మాట్లో ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయ, అలాగే తొలి ఆసియా కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. Read Also:Snake At Cricket…
IND vs ENG Test: ఇంగ్లాండ్ లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండవ రోజు లంచ్ సమయానికి పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 110 ఓవర్లలో 6 వికెట్లకు 419 పరుగులు చేసింది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ (1), శుబ్‌మన్ గిల్ (168) క్రీజ్‌లో ఉన్నారు. ఇక భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 288 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్స్‌తో 168 పరుగులతో…
IND vs ENG: బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజున టీమిండియా ఓ మోస్తారుగా మంచి స్థానంలో ఉందనే చెప్పవచ్చు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 85 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ కి హీరోగా నిలిచిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో జట్టును నడిపించాడు. ఇక మొదటి రోజు భారత బ్యాటింగ్‌కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.…
ఎడ్జ్ బస్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా 3 మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. మొదటి రోజు బ్యాటింగ్ చేసిన భారత్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత శతకంతో అలరించాడు. సారథిగా ఫుల్‌టైమ్ బాధ్యతలు చేపట్టిన గిల్.. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్…
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. తొలి టెస్టులో ఆధిపత్యాన్ని ప్రదర్శించినా.. చివరికి ఓటమి చవిచూసిన టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు మొదటి టెస్టులో భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం అందుకున్న ఇంగ్లండ్.. జోరు కొనసాగించాలని చూస్తోంది. ఈ టెస్ట్ కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తుది జట్టును ప్రకటించింది. ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగాలా అనే సందిగ్ధంలో భారత్ ఉంది. ఈ…
Shubman Gill: ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. తొలి టెస్టు మ్యాచ్ లోని మొదటి ఇన్సింగ్స్ లో టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. 140 బంతుల్లో 14 ఫోర్లు బాది కేరీర్ లోనే ఆరో శతకం పూర్తి చేసుకున్నాడు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియాలి ఇది కొత్త శకం. ఇంగ్లండ్‌లో భారత్ టెస్టు సిరీస్ గెలిచి 18 ఏళ్లు అవుతుంది అంటే.. అక్కడ జట్టును నడిపించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా ఇంగ్లీష్ గడ్డపై పర్యటిస్తున్నా.. అక్కడ మూడుసార్లు మాత్రమే భారత్ టెస్టు సిరీస్ గెలిచింది.…
టెస్టు క్రికెట్లో బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. త్వరగా వికెట్స్ పడినప్పుడు ఇన్నింగ్స్‌ను నిలబెట్టడం, అవసరమైనపుడు గేర్ మార్చి వేగంగా పరుగులు చేయడం ఈ స్థానం ప్రత్యేకత. జట్టుకు వెన్నెముక అయిన ఈ స్థానంలో భారత్ తరఫున క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎన్నో టెస్టులు (179 టెస్టులు) ఆడాడు. సచిన్ రిటైర్మెంట్ అనంతరం కింగ్ విరాట్ కోహ్లీ (99 టెస్టులు) ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇప్పుడు కోహ్లీ కూడా టెస్టులకు…
IND vs ENG Test Series: ఇంగ్లాండ్ పర్యటన టీమిండియా టెస్ట్ చరిత్రలో ఎప్పుడూ ఓ సవాలుతో కూడిన అధ్యాయం. స్వింగ్, సీమ్‌కు ప్రసిద్ధమైన ఇంగ్లాండ్ పిచ్ లపై భారత్ కు విజయం సాధించడం ఎప్పుడూ కష్టసాధ్యమే. 1932లో మొదటిసారిగా ఇంగ్లాండ్ టూర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో మధురమైన, సవాలుతో కూడిన క్షణాలను భారత జట్టు అనుభవించింది. ఇప్పడు, 2025లో ఇంగ్లాండ్‌లో 18 ఏళ్లుగా సాధించలేని టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించేందుకు కొత్త కెప్టెన్…
జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా టెండూల్కర్-ఆండర్సన్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ లు జరుగుతాయి. శుభ్‌మాన్ గిల్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ఇంగ్లాండ్‌కు బెన్ స్టోక్స్ నాయకత్వం వహించనున్నాడు. ఈ పర్యటనలో భారత్ గెలవడం కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు చాలా అవసరం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి…