లక్నోలోని ఎకానా స్టేడియంలో మరికొద్దిసేపట్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నాలుగో టీ20కి దూరమయ్యాడు. కాలి గాయంతో నాలుగో టీ20కి దూరమయ్యాడు. ఐదవ టీ20కి కూడా అందుబాటులో ఉండడని తెలుస్తోంది. నాలుగో టీ20లో గిల్ స్థానంలో సంజూ శాంసన్ ఓపెనర్‌గా ఆడనున్నాడు. టీ20 సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం…