టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నుంచి నేర్చుకున్న విషయాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని భారత వన్డే వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా టెస్టు క్రికెట్లో నువ్వు సాధించిన దానికి భారత్ కృతజ్ఞతతో ఉంటుందన్నాడు. ప్రతి ఒక్కరికీ నువ్వు స్ఫూర్తి అని గిల్ పేర్కొన్నాడు. తాజాగా రోహిత్ టెస్టు క్రికెట్ నుంచి రిటైరైన విషయం తెలిసిందే. జూన్‌లో ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం రోహిత్…