సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. అక్టోబర్ 7 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ టీ20 సిరీస్‌కు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పని భారాన్ని తగ్గించే విధానంలో భాగంగా అతడిని పొట్టి సిరీస్‌లో ఆడించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఈ సీజన్లో భారత్ ఆడే పది టెస్టులకు అతడు జట్టులో ఉండే అవకాశముంది. త్వరలో న్యూజిలాండ్‌తో…