ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. 193 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 170 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (61 నాటౌట్; 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. భారత్ టాపార్డర్, మిడిలార్డర్ వైఫల్యం కారణంగానే ఈజీగా గెలిచే టెస్టులో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇదే విషయాన్ని ఒప్పుకున్నాడు. టాపార్డర్‌లో…