వరుస బ్లాక్‌బస్టర్‌లు, పాన్-ఇండియా స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్, ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ‘ఆకాశంలో ఒక తార’తో అలరించబోతున్నారు. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో, ఈ చిత్రాన్ని సందీప్ గుణ్ణం , రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇంతకు ముందు విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలను…