PM Narendra modi dedicates Shri Mahakal Lok to the nation: మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకాల్ లోక్ కారిడార్ మొదటి దశలను ప్రారంభించే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయ వస్త్రధారణలో 12 జ్యోతిర్లాంగాల్లో ఒకటైన మహాకాలేశ్వర్ ఆలయ గర్భగుడిలో పూజలు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియాలు ప్రధాని మోదీ వెంట ఉన్నారు.