కొత్త వాహనాలు కొనేవారికి కొత్త సంవత్సరంలో బిగ్ రిలీఫ్ లభించింది. వాహనాల రిజిస్ట్రేషన్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి వాహనాల షో రూంల (డీలర్ల) వద్ద నుండే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రవాణా శాఖ లో నేటి నుండి మరిన్ని సంస్కరణలు అమలుకానున్నాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇకపై కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్టేషన్ కోసం రవాణా శాఖ…