సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు సంబంధించిన నిబంధనలను మార్చలేమని కోర్టు పేర్కొంది. పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నియమాలను మధ్యలో మార్చలేమని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది.