కరోనా కారణంగా ఆగిపోయిన పలు చిత్రాల షూటింగ్స్ ఇప్పుడు మొదలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ , నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా బుధవారం ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం అయ్యాయి. ఇందులో జెమినీ కిరణ్, కె.ఎల్. దామోదర ప్రసాద్, ముత్యాల రాందాసు, విజయేందర్ రెడ్డి, నరేశ్, జీవిత, పల్లి కేశవరావు, సురేందర్ రెడ్డి, ప్రసన్న కుమార్, భరత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ…