Prakash Raj: ఛేజింగ్ సీన్స్ తో షూటింగ్ షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలిసిన బృందంలో ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి తెలంగాణాలోని కొన్ని నీటిపారుదల ప్రాజెక్ట్స్ ను ప్రకాశ్ రాజ్ సందర్శించారు. ఇదే సమయంలో ఆయన నటన, చిత్ర నిర్మాణాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఇటీవలే ప్రకాశ్‌రాజు, నవీన్‌చంద్ర, కార్తీక్ రత్నం, వాణీబోజన్, అమృతా అయ్యర్‌లు కీలకపాత్రల్లో నటిస్తోన్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. యం. రాజశేఖర్ రెడ్డి, ‘తలైవి’ దర్శకుడు ఎ. ఎల్ విజయ్, ప్రకాశ్‌రాజ్, బి. నర్సింగరావు సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు. శ్రీ అండ్ కావ్య సమర్పణలో ప్రొడక్షన్ నం 6గా తెరకెక్కుతున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం తొలి షెడ్యూల్ శివరాత్రి రోజున హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రంతో వాలీ మోహన్‌దాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
తెలుగులోను, తమిళంలోను ప్రకాశ్‌రాజ్, నవీన్‌చంద్ర ఇద్దరు ఫేమస్ కావటంతో వారివురు కామన్‌గా ఈ రెండు వర్షన్స్ లో నటించనున్నారు. తెలుగులో ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నం చేస్తున్న పాత్రను తమిళ్‌లో ‘అసురన్’ ఫేమ్, సింగర్ టి. జె. అరుణాచలం నటించటం విశేషం. వారివురితో పాటు నవీన్‌చంద్ర పాల్గొనే కీలకమైన ఛేజింగ్ సన్నివేశాలను హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్టు నిర్మాత యం.రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి శివ మల్లాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read
- Raaka: 'రాకా'లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
- Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
తాజావార్తలు
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!