చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగలి కనుమదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని సమాచారం అందిందని తెలిపారు.