Krishnam Raju companionship with Tollywood top Heroes: కృష్ణంరాజు కాలేజీ రోజుల నుండి అక్కినేని నాగేశ్వరరావు అభిమాని. నాగేశ్వరరావు నటించిన ‘సువర్ణ సుందరి’ సినిమాను 30 సార్లు, ‘మూగమనసులు’ చిత్రాన్ని పాతిక సార్లు పైగా చూశానని చెబుతుంటారు. విశేషం ఏమంటే… తన అభిమాన నటుడు అక్కినేనితో కృష్ణంరాజు ‘బుద్ధిమంతుడు, జై జవాన్, పవిత్రబంధం, మంచిరోజులు వచ్చాయి, మాతృమూర్తి’ చిత్రాలలో విలన్ గా, ‘యస్.పి. భయంకర్’లో సపోర్టింగ్ హీరోగా నటించారు. ఇక ఎన్టీయార్ అంటే కృష్ణంరాజుకు ప్రత్యేక…
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అస్సలు వారసురాలు ఎవరు అంది ఇప్పటికి మిస్టరీగానే మారింది. ఇప్పటివరకు ఆమె వారసురాలిని నేను అంటే నేను అని చాలామంది మీడియా ముందు రచ్చ చేశారు. ఇక తాజాగా మరో మహిళ తాను జయలలిత, శోభన్ బాబు ల వారసురాలిని అంటూ తహసీల్దార్ కార్యాలయంలో రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మధురై తిరుమళ్లువర్ నగర్ కు చెందిన 38ఏళ్ల మీనాక్షి కి మురుగేశన్ అనే వ్యక్తితో వివాహమైంది.…
నటభూషణ శోభన్ బాబు హీరోగా కొన్ని నవలా చిత్రాలు తెలుగువారిని అలరించాయి. మాదిరెడ్డి సులోచన రాసిన ‘మిస్టర్ సంపత్ ఎమ్.ఎ.’ నవల ఆధారంగా తెరకెక్కిన శోభన్ బాబు చిత్రం ‘ఈతరం మనిషి’. పల్లవి ఆర్ట్ పిక్చర్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ యస్.వెంకటరత్నం, అతని మిత్రుడు కె.రవీంద్రనాథ్ కలసి ఈ చిత్రాన్నినిర్మించారు. వి.మధుసూదనరావు దర్శకత్వంలో ‘ఈతరం మనిషి’ తెరకెక్కింది. 1977 ఫిబ్రవరి 10న ‘ఈతరం మనిషి’ జనం ముందు నిలచింది. ‘ఈతరం మనిషి’ కథ ఏమిటంటే – రవి…
(అక్టోబర్ 22తో ‘రామాలయం’ చిత్రానికి 50 ఏళ్ళు)మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ టాప్ స్టార్స్ గా రాజ్యమేలుతున్న రోజుల్లో వారి చిత్రాల్లో సైడ్ హీరోస్ గా నటించేవారు జగ్గయ్య, కాంతారావు. తరువాతి రోజుల్లో వారిద్దరూ సోలో హీరోస్ గా రాణించారు. తమకంటూ కొంతమంది నిర్మాతలను సంపాదించుకొన్నారు. అయితే తమకు లభించిన కేరెక్టర్ రోల్స్ ను మాత్రం జగ్గయ్య, కాంతారావు వదలుకోలేదు. అలా సాగుతూనే వారికి తగ్గ పాత్రల్లో నటించి అలరించారు. జగ్గయ్య హీరోగా రామవిజేతా ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన…