Krishnam Raju companionship with Tollywood top Heroes: కృష్ణంరాజు కాలేజీ రోజుల నుండి అక్కినేని నాగేశ్వరరావు అభిమాని. నాగేశ్వరరావు నటించిన ‘సువర్ణ సుందరి’ సినిమాను 30 సార్లు, ‘మూగమనసులు’ చిత్రాన్ని పాతిక సార్లు పైగా చూశానని చెబుతుంటారు. విశేషం ఏమంటే… తన అభిమాన నటుడు అక్కినేనితో కృష్ణంరాజు ‘బుద్ధిమంతుడు, జై జవాన్, పవిత్రబంధం, మంచిరోజులు వచ్చాయి, మాతృమూర్తి’ చిత్రాలలో విలన్ గా, ‘యస్.పి. భయంకర్’లో సపోర్టింగ్ హీరోగా నటించారు. ఇక ఎన్టీయార్ అంటే కృష్ణంరాజుకు ప్రత్యేక గౌరవం. సినిమా రంగం మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని తండ్రి మనసులోంచి దూరం చేసింది ఎన్టీయార్ ఇచ్చిన ఆతిథ్యమే అంటారు కృష్ణంరాజు. ఎన్టీయార్ అంటే ఎనలేని గౌరవం ఉన్న కృష్ణంరాజు తన సొంత చిత్రం ‘కృష్ణవేణి’ శతదినోత్సవ వేడుకకు ఎన్టీయార్ దంపతులను ఆహ్వానించారు. హైదరాబాద్ శాంతి థియేటర్ లో జరిగిన ఆ వేడుకకు ఎన్టీయార్, బసవతారకం దంపతులు హాజరయ్యారు. ఎన్టీయార్ తో ‘భలే మాస్టర్, బడిపంతులు, వాడేవీడు, పల్లెటూరి చిన్నోడు, మనుషుల్లో దేవుడు, మంచికి మరో పేరు, సతీసావిత్రి’ చిత్రాలలో నటించారు.
కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరూ ‘తేనెమనసులు’ చిత్రం మేకప్ టెస్ట్ కు హాజరయ్యారు. అయితే కృష్ణ సెలెక్ట్ కాగా, కృష్ణంరాజు రిజెక్ట్ అయ్యారు. అయితే అప్పటికే వారిద్దరూ మంచి స్నేహితులు. దాంతో కృష్ణను కృష్ణంరాజు ఎంతో అభినందిస్తూ, పార్టీ కూడా ఇచ్చారు. విశేషం ఏమంటే ‘చిలకా గోరింక’తో హీరో అయిన కృష్ణంరాజు ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన ‘అవేకళ్ళు’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. విలన్ గా గుర్తింపు రావడంతో దాదాపు యాభై చిత్రాలలో ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. కృష్ణ, కృష్ణంరాజు కూడా కలిసి పలు చిత్రాలలో హీరోలుగా నటించారు. కృష్ణతో కృష్ణంరాజు ఏకంగా 17 చిత్రాలలో నటించారు. శోభన్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘వీరాభిమన్యు’. ఈ సినిమాలో అవకాశం కోసం కృష్ణంరాజు కూడా అప్పట్లో ప్రయత్నంచారు. కానీ ఆయన యాటిడ్యూడ్ పట్ల కాస్తంత అనీజీ ఫీలైన నిర్మాత డూండీ కృష్ణంరాజుకు ఛాన్స్ ఇవ్వలేదు. అయితే ఆ తర్వాత కృష్ణంరాజు మనసెరిగి పలు చిత్రాలు ఆయనతో నిర్మించారు. ఇక శోభన్ బాబుతో కృష్ణంరాజు ‘ఇద్దరూ ఇద్దరే, కురుక్షేత్రం, రామబాణం, జీవితం’ తదితర చిత్రాలలో నటించారు.
Asia Cup 2022: నేడు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్.. పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక