తెలుగు రాష్ట్రాల్లో చలి గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంటినుంచి బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇప్పటికే చలి పెరిగిపోగా, మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. రమణీయ దృశ్యాలు ఓ వైపు ఆహ్లాదపరుస్తున్నా.. మరోవైపు పొగ మంచుతో వాహనదారులకు ఇబ్బందులు కలగనున్నాయి. దట్టమైన పొగమంచుతో ఊరేదో.. అడవేదో.. రోడ్డేదో.. చెట్టేదో తెలియకుండా పోతోంది.
సంక్రాంతి ముగిసేసరికి చలి తీవ్రత తగ్గాలి. కానీ ఈసారి సంక్రాంతి తర్వాత చలి చంపేస్తోంది. ఉదయం సూరీడు రావడం లేటవుతోంది. శనివారం ఏపీలో అత్యంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు నిజమయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ చలి తీవ్రంగా వుండే అరకు ఈసారి కూడా అదే చలి ప్రభావం కనిపిస్తోంది. ఆంధ్రలోని పశ్చిమగోదావరి జిల్లాలో జంగమహేశ్వరపురంలో శనివారం ఉదయం 5.8 డిగ్రీల సెల్షియస్…