యువతను కిర్రెక్కించేలా బాణీలు కట్టి, భలేగా హిట్లు పట్టారు చక్రి. అప్పట్లో చక్రి స్వరకల్పనతో సక్సెస్ రూటులో సాగాయి పలు చిత్రాలు. పిన్నవయసులోనే కన్నుమూసిన చక్రి సంగీత దర్శకునిగా మాత్రం భలే పేరు సంపాదించారు. అలాగే పలు దానధర్మాలూ చేసి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. చక్రి సంగీతంతో సంబరాలు చేసుకున్న అభిమానులు ఇప్పటికీ ఆయన స్వరవిన్యాసాలు తలచుకుంటూ, ఆయన జయంతిన ఏదో ఒక సేవాకార్యక్రమం నిర్వహిస్తూనే ఉండడం విశేషం! గిల్లా చక్రధర్ 1974 జూన్ 15న తెలంగాణలోని…