ప్రముఖ యాంకర్ శివజ్యోతి తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లి అక్కడ క్యూ లైన్లో నిలబడి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. శ్రీవారి ప్రసాదంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, హిందూ సంఘాలు, నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ శివజ్యోతి తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి ఉన్న సమయంలో, టీటీడీ సేవకులు…