లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్రాలో ఒ జవాన్ మోసానికి పాల్పడ్డాడు. డబ్బులు ఇస్తే ఈవీఎంను సెట్ చేస్తా అంటూ ఓ రాజకీయ నాయకుడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.
రాజకీయ ప్రయోజనాల కోసం పారిశ్రామికవేత్తలపై దాడి చేయడం సరైంది కాదన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యాలు రాజకీయంగా సంచలనం అయ్యాయి. అదానీ విషయంలో ప్రతిపక్షాల దూకుడును కొట్టిపారేసిన శరద్ పవార్ వ్యాఖ్య మహారాష్ట్ర రాజకీయ వ్యవస్థలో చిచ్చు రేపింది.