Maharashtra: మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలకు ఇంకా పోలింగ్ జరగకముందే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తన సత్తా చాటింది. ఈ ఎన్నికలకు జనవరి 15న ఓటింగ్ జరగాల్సి ఉండగా.. ఇప్పటికే 68 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయి. దీంతో అనేక పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ లేకుండానే విజయాలు దక్కాయి. READ MORE:…