జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై ప్రపంచ దేశాలు సంతాపాన్ని ప్రకటిస్తున్నాయి. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయనపై మాజీ సైనికులు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆయన మరణించాడు. ఈ ఘటన రాజధాని టోక్యోకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారా నగరంలో చోటు చేసుకుంది. అయితే షింజో అబేను బతికించేందుకు డాక్టర్లు ఐదు గంటల పాటు శ్రమించినా కాపాడలేకపోయారు. జపనీస్ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు షింజో అబే ఎన్నికల ప్రచారంలో…
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేని హత్య చేయడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేసింది. జపాన్ నారా పట్టణంలో మాట్లాడుతున్న సమయంలో ఓ దుండగుడు రెండు రౌండ్ల పాటు షింజో అబేపైకి కాల్పులు జరిపారు. దీంతో షింజో అబే మరణించారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షింజో అబేకు నివాళిగా భారత్ రేపు(జూలై 9) ఒక రోజు పాటు జాతీయ సంతాప దినం పాటించాలని ప్రధాని మోదీ…
షింజో అబే.. జపాన్ మాజీ ప్రధానమంత్రి. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్షుడు. 2006-07లో ఏడాది పాటు, 2012-2020లో 8 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు. తద్వారా జపాన్‌కి ఎక్కువ కాలం (మొత్తం నాలుగు సార్లు) ప్రధానమంత్రిగా చేసిన ఘనత వహించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌కి ప్రధాని అయిన పిన్న వయస్కుడిగానూ రికార్డు నెలకొల్పారు. ప్రధాని కాకముందు 2005-06లో క్యాబినెట్ చీఫ్ సెక్రెటరీగా వ్యవహరించారు. 2012లో కొన్నాళ్లపాటు ప్రతిపక్షనేతగానూ పనిచేశారు. మొదటిసారి 1993 ఎన్నికల్లో…
Prime Minister Narendra Modi on Friday said that he is "deeply distressed" over the attack on former Japanese Prime Minister Shinzo Abe and conveyed his prayers to his family.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని నేతాజీ రీసెర్చ్ బ్యూరో.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు “నేతాజీ అవార్డు 2022″ను ప్రదానం చేసింది. ఈ మేరకు కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్‌లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాసంలో ఆదివారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో నేతాజీ అవార్డు 2022ను అబేకు ప్రదానం చేస్తున్నట్లు నేతాజీ రీసెర్చ్ బ్యూరో తెలిపింది. అయితే ఈ అవార్డును కోల్‌కతాలోని జపాన్ కాన్సుల్ జనరల్ నకమురా యుటాకా అబే తరపున ఈ…