మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తండ్రి సీపీ చాకో మృతిచెందాడు. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో వారు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాకో తండ్రి చనిపోగా, చాకో, అతడి తల్లి, సోదరుడు, డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.…