ఈ వివాదాస్పద మసీదు అంశం కోర్టుకు చేరింది. సిమ్లాలోని మసీదు మూడు అంతస్తులను కూల్చివేయాలని సిమ్లా కోర్టు ఈ రోజు ఆదేశించింది. సంజౌలీ మసీదు కూల్చివేత ప్రక్రియను పూర్తి చేసేందుకు మసీదు కమిటీకి, వక్ఫ్ బోర్డుకు సిమ్లా మున్సిపల్ కమిషనర్ కోర్టు రెండు నెలల గడువు ఇచ్చింది.
Shimla Mosque Row: హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను సిమ్లా మసీదు నిర్మాణం కుదిపేస్తోంది. అక్రమంగా ఈ మసీదును నిర్మిస్తున్నారని అధికార కాంగ్రెస్‌కి చెందిన మంత్రి అనిరుద్ధ్ సింగ్ ఏకంగా అసెంబ్లీలో వ్యాఖ్యానించడం రచ్చకు కారణమైంది. ఇంతే కాకుండా మసీదు ఉన్న ఏరియాలో దొంగతనాలు, లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయన్న మంత్రి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి.