టీఎఫ్ సీసీ నంది అవార్డ్స్ వేడుకను దుబాయ్ లో నిర్వహించడానికి ప్రతాని రామకృష్ణ గౌడ్ గట్టిగా కృషి చేస్తున్నారు. అందుకోసం శుక్రవారం ఆయన దుబాయ్ వెళ్ళి అక్కడ షేక్ అబు సలీమ్ ను కలిశారు. దుబాయ్ లో జరిగే వేడుకకు బాలీవుడ్ సినీ ప్రముఖులనూ ఆహ్వానిస్తున్నట్టు రామకృష్ణ గౌడ్ తెలిపారు.