TFCC: నంది అవార్డుల కోసం దుబాయ్ షేక్ అబుసలీంని కలిసిన ప్రతాని రామకృష్ణ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prathani Ramakrishna Goud: తెలంగాణ ప్రభుత్వం సహకారంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుకలు దుబాయ్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన, టీమా ప్రెసిడెంట్, మిస్ ఏసియా రష్మి ఠాకూర్ దుబాయ్ వెళ్లి షేక్ అబుసలీంని కలిశారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, “టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుకలు త్వరలో దుబాయ్ లో చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దుబాయ్ వచ్చి షేక్ అబు సలీం గారిని కలిశాం. జులై నెలాఖరు కానీ అగస్టు మొదటి వారంలో కానీ అవార్డ్స్ ప్లాన్ చేసుకోమన్నారు. షేక్ అబు సలీం గారు ఎంతో బాగా రిసీప్ చేసుకున్నారు. నంది అవార్డ్స్ పట్ల ఎంతో ఆసక్తి కనబరిచారు. ప్రతి ఏడాది దుబాయ్ లో నంది అవార్డ్స్ జరపడానికి సహకరిస్తామని మాటిచ్చారు. ఇక దుబాయ్ ప్రిన్స్, కేరళ సియమ్, తెలంగాణ మంత్రులను, బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్, జితేంద్ర గారిని నంది అవార్డ్స్ కోసం ఆహ్యానిస్తున్నాం. అలాగే సన్నిలియోన్, ముమైత్ ఖాన్ అవార్డ్స్ వేడుకల్లో పర్ఫార్మెన్స్ చేయనున్నారు. ఇక మన తెలుగు హీరోలు మంచు విష్ణు, శ్రీకాంత్, శివాజీరాజా ఇలా చాలా మంది ఆర్టిస్ట్స్ సపోర్ట్ చేస్తున్నారు. దుబాయ్ లో పలు అవార్డ్స్ ఫంక్షన్స్ నిర్విహించిన దినేష్ మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఇలా అందరి సహకారంతో నంది అవార్డ్స్ సక్సెస్ చేయడానికి శత విధాల ప్రయత్నిస్తున్నాం. అలాగే `మిస్ ఏసియా` రష్మి ఠాకూర్, కొటారి గారు దుబాయ్ లో వారికున్న పరిచయాలతో నంది అవార్డ్స్ కోసం ఎంతో సహకరిస్తున్నారు” అని అన్నారు.
Also Read
- Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
- Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. 'భాగమతి' డైరెక్టర్‌పై కేసు నమోదు!
- Lenin : అఖిల్‌కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
- Prabhas : 'ఫౌజీ' బిజినెస్ వేట షురూ.. భారీ రేటుకు నార్త్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్!
తాజావార్తలు
-
Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్‌మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్‌గా రికార్డు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
-
IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
-
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
-
Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!