Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కి ఆ పార్టీకి దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ని త్వరలో వీడుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. బుధవారం ప్రారంభం కానున్న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మలయాళ భాషా పాడ్‌కాస్ట్ ‘వర్తమానం’లో కేరళలో కాంగ్రెస్ నాయకుడు లేకపోవడాన్ని కూడా ఆయన విమర్శించారు. పాడ్ కాస్ట టీజర్ ఇప్పటికే విడుదలైంది. ‘‘పార్టీ నన్ను కోరుకుంటే నేను పార్టీకి అందుబాటులో ఉంటాను. లేకపోతే నాకు సొంత పనులు…