స్టార్‌డమ్ సంపాదించాలంటే తప్పనిసరిగా ‘మాస్ ఇమేజ్’ ఉండాలన్న పాత ఫార్ములాను నేటి యువ హీరోలు పక్కన పెడుతున్నారు. మాస్ హీరో అనిపించుకోవడం కంటే, ‘సక్సెస్’ వస్తే చాలు అనే కొత్త మానియాతో వీరు విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. యువ హీరోల టీజర్స్, ట్రైలర్స్ పరిశీలిస్తే, ఒకరిద్దరు మినహా చాలామంది మాస్ ఇమేజ్‌కు దూరంగా, కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో, యాక్షన్ హీరోలుగా ప్రయత్నించి ఫెయిల్ అయిన లేదా రొటీన్ ట్రాక్‌లో ఇరుక్కున్న యువ హీరోలు…