తొలి మహిళా కండక్టర్లను టీజీఎస్ ఆర్టీసీ సన్మానించింది. ఆర్టీసీలో తొలి మహిళా కండక్టర్లుగా విధుల్లో చేరి 28 ఏళ్ల ఉత్తమ సర్వీసును పూర్తి చేసుకున్న ముగ్గురిని యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్‌లో దిల్‌సుఖ్‌నగర్ డిపోనకు చెందిన శ్రీదేవి, అనిత, మెహిదిపట్నం డిపోకు చెందిన శారదను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ సన్మానించారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో పి.రవీంద్రనాథ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘యోగి’. ఈ చిత్రంలో నయనతార నాయికగా నటించింది. కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ‘జోగి’ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. 2007 జనవరి 14న విడుదలైన ‘యోగి’ మాస్ ను ఆకట్టుకుంది. ‘యోగి’ కథ ఏమిటంటే- కన్నతల్లి అతిగారాబంతో ఈశ్వర చంద్రప్రసాద్ ఏ పనీపాటా చేయడు. తండ్ర మూర్తి చివరి కోరిక ఈశ్వర్ ప్రయోజకుడు కావాలన్నది. దాంతో పట్నంలో ఉన్న…
(సెప్టెంబర్ 19న ‘కలియుగ కృష్ణుడు’కు 35 ఏళ్ళు) నందమూరి బాలకృష్ణ నటనాపర్వంలో 1986వ సంవత్సరం మరపురానిది, ఆయన అభిమానులు మరచిపోలేనిది. ఆ సంవత్సరం బాలయ్య ఏడు చిత్రాలలో నటించగా, మొదటి సినిమా ‘నిప్పులాంటి మనిషి’ పరాజయం పాలయింది. ఆ తరువాత వచ్చిన ఆరు చిత్రాలూ వరుసగా ఘనవిజయం సాధించాయి. అలాంటి రికార్డు తెలుగు చిత్రసీమలో మరెవ్వరికీ లేదు. ఆ విజయపరంపరలో ఐదవ చిత్రంగా విడుదలయింది ‘కలియుగ కృష్ణుడు’. 1986 సెప్టెంబర్ 19న విడుదలైన ‘కలియుగ కృష్ణుడు’ చిత్రానికి…
సౌత్ లోని పలు భాషల్లో నటించి ఊర్వశిగా అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్న సీనియర్ నటి శారద. తాజాగా ఆమె అనారోగ్యానికి గురయ్యారంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ తనకేం కాలేదని, ఆరోగ్యంగా ఉన్నాను అని వెల్లడించారు. ఆమె ఎన్టీవీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ “నేను చెన్నైలోని నా ఇంట్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాపై వస్తున్న తప్పుడు వార్తలు అవాస్తవం” అని తెలిపారు. దీంతో నెట్టింట్లో…