సౌత్ లోని పలు భాషల్లో నటించి ఊర్వశిగా అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్న సీనియర్ నటి శారద. తాజాగా ఆమె అనారోగ్యానికి గురయ్యారంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ తనకేం కాలేదని, ఆరోగ్యంగా ఉన్నాను అని వెల్లడించారు. ఆమె ఎన్టీవీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ “నేను చెన్నైలోని నా ఇంట్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాపై వస్తున్న తప్పుడు వార్తలు అవాస్తవం” అని తెలిపారు. దీంతో నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆమె మరణవార్త అవాస్తవమని తేలిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు సినిమాల్లోనే కాకుండా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన శారద ప్రస్తుతం సినిమాల నుంచి విరామం తీసుకున్నారు.
Read Also : ఎన్టీఆర్ కు గాయం… క్లారిటీ ఇచ్చిన “ఆర్ఆర్ఆర్” టీం
బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె ‘ఇద్దరు మిత్రులు’, ‘ఆత్మబంధువు’, ‘దాగుడు మూతలు’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు, శారద జంట ‘మానవుడు-దానవుడు’, ‘దేవుడు చేసిన పెళ్ళి’, ‘శారద’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. మలయాళ చిత్రాల ద్వారా శారద జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1996లో 11వ లోక్‌సభకు తెనాలి నియోజవర్గము నుండి తెలుగుదేశం పార్టీ తరఫున శారద ఎన్నికయ్యారు.