తెలుగు సినిమా ఆరంభంలో నాటకాల్లో నటించిన వారినే కెమెరా ముందూ నటింప చేసేవారు. ఇప్పటికీ కొందరు నాటకాల వారిని తెరపై చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే రూపురేఖలనే మార్చే సే రోజులు వచ్చాయి కానీ, ఆ రోజుల్లో పాత్రకు తగ్గ రూపం, అందుకు తగ్గ అభినయం, వాటిని మించిన వాచకం తప్పని సరిగా నటీనటులకు ఉండాల్సిందే! తెలుగునేలపై పలు నాటకాల ద్వారా నటిగా తనను తాను నిరూపించుకున్న వెల్లాల సుబ్బమ్మ; తరువాతి రోజుల్లో శాంతకుమారిగా తెరపై…