Shanmukh Jaswanth: ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురువారం డ్రగ్స్ కేసులో అరెస్టైన షణ్ముఖ్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు కావడంతో అతను బయటకు వచ్చాడు. ఇక అదంతా పక్కన పెడితే.. షన్నును అరెస్ట్ చేసిన సమయంలో తీసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.