Shanmukh Jaswanth: షణ్ముఖ్ డిప్రెషన్.. ఆమె కారణమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shanmukh Jaswanth: ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురువారం డ్రగ్స్ కేసులో అరెస్టైన షణ్ముఖ్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు కావడంతో అతను బయటకు వచ్చాడు. ఇక అదంతా పక్కన పెడితే.. షన్నును అరెస్ట్ చేసిన సమయంలో తీసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో షన్ను.. తన అన్న ప్రియురాలు అయిన డాక్టర్ ను తిడుతున్నాడు. ఇంకోపక్క తాను డిప్రెషన్ లో ఉండి డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపాడు. దీంతో షన్నుకు డిప్రెషన్ ఉండడమేంటి అంటూ పలు అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. షన్ను జీవితం మొత్తం తెరిచిన పుస్తకమే. యూట్యూబ్ లో వైవా అనే షార్ట్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఆ తరువాత యూట్యూబ్ లోనే అనేక షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్నాడు. గతంలో ఆయన చేసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తో పాటు వెబ్ సిరీస్లు హిట్ కావడంతో బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. ఇక మొదటి నుంచే దీప్తి సునయన తో అతడు ప్రేమాయణం నడుపుతూ వచ్చాడు.
బిగ్ బాస్ లోకి మొదట దీప్తి వెళ్ళినప్పుడు.. ఆమె వేరొకరితో చనువుగా ఉందని, షన్ను ఆమెపై ఫైర్ అయ్యి కొద్దిరోజులు దూరం పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇక షన్ను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సిరితో క్లోజ్ గా ఉండడం, బయటకు వచ్చాకా దాని గురించి ఈ జంట గొడవపడటంతో వీరి మధ్య ఉన్న బంధం ముక్కలయింది. బిగ్ బాస్ నుంచి రాగానే పెళ్లి చేసుకుంటారు అనుకున్న ఈ జంట బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. ఇక అప్పటినుంచి షన్ను డిప్రెషన్ లో ఉన్నాడా ..? అనేది తెలియాల్సి ఉంది. ఇక దాని తరువాతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. అప్పుడు కూడా షన్ను డ్రగ్స్ తీసుకొని ఉన్నాడనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు షన్ను.. తన నోటి నుంచే తాను డిప్రెషన్ లో ఉన్నట్లు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. షన్ను మానసిక పరిస్థితి బాలేదని తెలుస్తోంది. ఇదంతా చూసిన షన్ను అభిమానులు.. దీప్తితో బ్రేకప్ కారణంగానే షన్ను డిప్రెషన్ లోకి వెళ్లినట్లు చెప్పుకొస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!