సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారతీయ సంతతికి చెందిన ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో 70 శాతానికి పైగా ఓట్లు ఆయన దక్కించుకున్నారు.