కన్నడ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ’. ఈ త్రీ డీ సినిమాను నిర్మాతలు జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్, అలంకార్ పాండియన్ ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుదల చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయాల్సిందిగా దిగ్గజ ఓటీటీ కంపెనీలు నిర్మాతలపై ఒత్తిడి తెచ్చినట్టు వార్తలు వచ్చాయి. అందులో నిజం ఉందని జాక్ మంజునాథన్ తెలిపారు.…