ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ముల చేతికి రాఖీ కట్టి రాఖీ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. “రక్షాబంధన్” పండుగ సోదర సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు చిహ్నం. సోదరీమణులు తమ సంతోషం, శ్రేయస్సు కోసం రాఖీ రోజున సోదరుల నుదుటిపై బొట్టు పెట్టి స్వీట్లు తినిపిస్తారు. అలాగే అన్నాదమ్ములు కూడా తమ సోదరీమణులకు గిఫ్ట్ లు…
స్టార్ జంట నాగ చైతన్య, సమంత కల త్వరలోనే నెరవేరబోతోంది. గోవా ఈ దంపతులకు ఇష్టమైన హాలిడే స్పాట్. వీరిద్దరూ గోవాలోనే వివాహం చేసుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా సమంత, చైతన్య గోవాలో పార్టీ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందనే. అయితే కొంతకాలం నుంచి చైతు, సామ్ గోవాలో విలాసవంతమైన బీచ్ హౌజ్ కోసం వెతుకుతున్నారట. తాజాగా వీరికి తాము కలలుగన్న డ్రీమ్ ప్లేస్ దొరికిందట.…
ఇటీవల “ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ లో కనిపించిన సమంత అక్కినేని ఇప్పుడు “శాకుంతలం” అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. “శాకుంతలం” మహాభారతంలోని ఆది పర్వం, కాళిదాస్ “అభిజ్ఞాన శకుంతలం” ఆధారంగా తెరకెక్కుతోంది. సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ కింగ్ దుష్యంత్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ…
సమంత రుత్ ప్రభు… అనగానే తెలుగువాళ్ళు కనుబొమ్మలు కాస్తంత ముడి వేస్తారు కానీ తమిళనాడులో హీరోయిన్ సమంత పూర్తి పేరుతోనే పాపులర్. అక్కినేని నాగచైతన్యను పెళ్ళి చేసుకోకముందే సమంత తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గానూ రాణించింది. అయితే తొలి తెలుగు సినిమా ‘ఏమాయ చేశావే’ సందర్భంగా ఏర్పడిన పరిచయం… ప్రణయంగా మారి ఆ తర్వాత చైతు, సమ్ము పరిణయానికి దారితీసింది. అప్పటి నుండీ సమంత సోషల్ మీడియాలో తన పేరు పక్కన…
టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని “మిమి” సినిమా రివ్యూ ఇచ్చేసింది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విభిన్నమైన చిత్రంలో పంకజ్ త్రిపాఠి, కృతి సనన్ లతో పాటు సుప్రియ పాథక్, సాయి తంఖంకర్, మనోజ్ పహ్వా, జయ భట్టాచార్య కూడా కీలక పాత్రల్లో కన్పించారు కన్పించారు. జూలై 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా సినిమాను వీక్షించిన సమంత “మిమిలో కృతి సనన్ మీరు చాలా అద్భుతంగా నటించారు.…
ప్రముఖ యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఓ భారీ ప్రాజెక్ట్ లో ఆఫర్ పట్టేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పౌరాణిక చిత్రం “శాకుంతలం. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీలో సమంత శకుంతలగా నటిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వర్షిణి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి వర్షిని సౌందరాజన్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ పాత్ర కోసం ఆమె వేసవిలో ఆమె చిత్రబృందాన్ని కలిసింది. ఆ తర్వాత తన పాత్ర…
అక్కినేని కోడలు సమంత దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది. సౌత్ లో ఆమె స్టైల్ ఐకాన్. ఆమె తన ఫ్యాషన్ అభిరుచితో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ ఉంటుంది. ఈ ఫ్యాషన్ క్వీన్ తాజాగా షేర్ చేసిన పిక్ నెట్టింట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కళ్ళు తిప్పుకోలేని అందంతో నెటిజన్ల దృష్టిని తనవైపుకు తిప్పేసుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్ కు గంటల వ్యవధిలోనే లక్షల్లో…
అల్లు కుటుంబం నుంచి నాలుగవ తరం కూడా సినిమా ఎంట్రీకి సిద్ధంగా ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. లెజండరీ నటుడు అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ ల తరువాత ఇప్పుడు బన్నీ కూతురు అల్లు అర్హా టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ స్టార్ హీరోయిన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. ప్రస్తుతం సమంత “శాకుంతలం” అనే చిత్రంలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ…
తొలిసారి వెబ్ సీరిస్ లో నటించిన స్టార్ హీరోయిన్ సమంత తన కాన్ టెంపరరీ హీరోయిన్స్ కాజల్, తమన్నాను మించిన గుర్తింపును తెచ్చుకుంది. హారర్ వెబ్ సీరిస్ లో నటించిన కాజల్ కు పెద్దంత పేరు రాలేదు. అయితే తమన్నా మాత్రం ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ వెబ్ సీరిస్ చేసి… ఫర్వాలేదని పించింది. అయితే ఒకటి వ్యాపార సామ్రాజ్యానికి చెందింది, మరొకటి థ్రిల్లర్ జానర్ కు సంబంధించింది కావడం కొన్ని…
దర్శకుడు గుణశేఖర్.. చారిత్రక, పౌరాణిక చిత్రాలను భారీ సెట్టింగులతో అద్భుతంగా తెరకెక్కించడంతో చాలా అనుభవమున్న దర్శకుడు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం ముచ్చట్లను పంచుకున్నారు. ‘శాకుంతలం పాత్రలో సమంతను తాను అసలు అనుకోలేదని, వేరే యాక్టర్స్ గురించి ఆలోచిస్తున్న సమయంలో సమంత అయితే బాగుంటుందని తన కూతురు నీలిమ సూచించిందని దర్శకుడు…