భారత ఆర్థిక వ్యవస్థలో చరిత్రాత్మక వృద్ధి నమోదైంది. మొట్టమొదటిసారిగా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లను దాటింది. దీనితో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించడానికి చాలా దగ్గరగా వచ్చింది. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి ఇది ఒక పెద్ద అడుగు.
Business Headlines 01-03-23: బీడీఎల్ డివిడెండ్ రూ.112 కోట్లు: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 112 కోట్ల రూపాయలను డివిడెండ్ కింద చెల్లించింది. ఈ మేరకు BDL చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మిశ్రా నిన్న మంగళవారం ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి చెక్ అందజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ.. ఒక్కో షేర్‌కి 8 రూపాయల 15 పైసల చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
RBI interest Rates Hike: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందరి అంచనాలనూ మించి రెపో రేటుని పెంచింది. దేశంలోని వివిధ వాణిజ్య బాంకులకు తాను ఇచ్చే లోన్లపై వసూలు చేసే వడ్డీ (రెపో) రేటును 50 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) హైక్ చేసింది. దీంతో ఇది 5.40 శాతానికి చేరింది.