బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ ఇటీవలే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అవకాశం ఉంటే.. స్వదేశంలో చివరి టెస్ట్ ఆడుతానని చెప్పాడు. భారత్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం నేరుగా అమెరికాకు వెళ్ళిపోయాడు. బంగ్లాలో తలెత్తిన సంఘర్షణల నేపథ్యంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. దానికి కారణం షేక్ హసీనా ప్రభుత్వమేనని ఆ యువకుడి తండ్రి కేసు పెట్టాడు. హసీనా పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన షకిబ్‌పైనా కేసు నమోదవడంతో అతడు స్వదేశానికి…