Titan Tragedy: అట్లాంటిక్ సముద్రంలో మునిపోయిన టైటానిక్ షిప్ ను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో బయలుదేరిన ‘టైటాన్’ సబ్‌మెర్సిబుల్ ప్రమాదానికి గురైంది. సముద్రం అడుగు భాగంలో 4 కిలోమీటర్ల లోతులో పేలిపోయింది. ఈ ప్రమాదంలో పాకిస్తానీ బిజినెస్‌మ్యాన్ కూడా చనిపోయాడు. పాకిస్తానీ - బ్రిటిష్ ధనవంతుడు షాహజాదా దావూద్, అతని కుమారుడు 19 ఏళ్ల సులేమాన్ దావూద్ మరణించిన ఐదుగురిలో ఉన్నారు.