దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందేశ్‌ఖాలీ కేసులో తొలి ఛార్జ్‌షీటును సీబీఐ దాఖలు చేసింది. ఇక ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ సహా నిందితులందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది.
West Bengal: పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత షేక్ షాజహాన్‌ని సీబీఐకి అప్పగించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. బెంగాల్ సందేశ్‌ఖాలీ లైంగిక ఆరోపణలు, భూకబ్జా, రేషన్ బియ్యం కుంభకోణాలనికి పాల్పడినట్లు ఇతడిపై ఆరోపణలు ఉన్నాయి. షాజహాన్‌కి సంబంధించిన మెటీరియల్ సీబీఐకి అందించడానికి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు బెంగాల్ పోలీసులకు గడువు విధించింది.
సందేశ్‌ఖాలీ కేసులో పోలీసులకు కలకత్తా హైకోర్టు సీరియస్ అయింది. పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని సందేశ్‌ఖాలీ (Sandeshkhali) కేసులో రాష్ట్ర పోలీసులకు కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.