పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన భారత్ జోడోయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. రాత్రి కామారెడ్డి సిరిసిల్ల రోడ్డులోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో భోజనాలు చేసి బస చేశారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతుల బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. ఇందిరా చౌక్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. షబ్బీర్ అలీ, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ శ్రేణుల ధర్నా ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
ఇవాళ టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య నాయకులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు సిద్దమయ్యారు.