తాను పోటీ పై షబ్బీర్ అలీ క్లారిటీ ఇచ్చారు. తాను కామారెడ్డి నుంచే పోటీ చేస్తానన్నారు. కేసీఆర్ రా.. కామారెడ్డికి ఇద్దరం తల పడదామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు పథకం ప్రకారం తాను ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు క్షమించరని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. కాంగ్రెస్ ఆకాశం లాంటిది.. ఆకాశంపై ఉమ్మితే మీపైనే పడుతుంది అంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పేరు దుబాయ్ కేసీఆర్.. దుబాయ్ ఏజెంట్ కొడుకు నా పై మాట్లాడటం విడ్డురంగా ఉందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల డబ్బు తో 4 హెలికాప్టర్ లల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీపై మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. మొన్న షబ్బీర్ అలీ గజ్వేల్ కి వచ్చి గజ్వేల్ నియోజకవర్గం ఏం అభివృద్ధి చెందలేదు అన్నాడని, గజ్వేల్ అభివృద్ధి కాలేదు అంటే సూర్యని మీద ఉమ్మేసినట్టే అని హరీష్ రావు మండిపడ్డారు. breaking news, latest news, telugu news, big news, harish rao, shabbir ali
కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారులారా కలిసి మాట్లాడుకుందాం రండి రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కోదండరాం సర్ జేఎసీ చైర్మన్ గా ఉంటేనే తెలంగాణ వచ్చింది అని ఆయన అన్నారు. కేసీఆర్ ఫాం హౌజ్ లో ఉండడమే తప్ప ప్రజలని కలిసి కష్టాలను తెలుసుకునే అలవాటు లేదు అని ఆయన ఆరోపించారు.
సీఎం కేసీఆర్ మహారాష్ట్ర కి ఎందుకు వెళ్తున్నారు?.. రాష్ట్ర సంపదను మహారాష్ట్రలో ఎందుకు ఖర్చు చేస్తున్నారు?.. అని ప్రశ్నించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అని చెప్పిన కవిత బీఆర్ఎస్ పార్టీ ఎంత మంది మహిళలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చింది? అని షబ్బీర్ అలీ అడిగారు.
భూములను అమ్ముకోవడాని కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. కామారెడ్డి నుంచే సీఎం కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుందని.. ఆ పార్టీని భూస్థాపితం చేద్దామని అన్నారు.
కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ను పోటీ చేయాలని ఎవరు కోరలేదు.. బీఆర్ఎస్ పార్టీ నేతలు అలా చెప్పడం సిగ్గు చేటు అంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. గజ్వేల్ లో ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు అని ఆయన విమర్శించారు.
కామారెడ్డి జిల్లా రామా రెడ్డి మండలం అన్నారం లో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పర్యటించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ సమక్షంలో భారీగా కాంగ్రెస్ లో చేరారు గ్రామస్థులు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తాను 2 సార్లు గెలిచా.. కానీ 2 తరాలకు అవసరమైమ అభివృద్ధి చేసానన్నారు. షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశానని ఆయన వ్యాఖ్యానించారు. 15 ఏళ్ళల్లో కామారెడ్డి అభివృద్ధి వెనుకబడిందని, పార్టీలు జంప్ లు చేసే నాయకులు దున్నపోతులుగా ఆయన అభివర్ణించారు. breaking…