Allahabad HC: లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు తన గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసుకునే హక్కును చట్టం కల్పిస్తుందని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. 17 ఏళ్ల బాలిక తనకు బిడ్డ కావాలా వద్దా అని నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఈ కామెంట్స్ చేసింది. 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు గర్భాన్ని వైద్యపరంగా తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు మహేష్ చంద్ర త్రిపాఠి, ప్రశాంత్ కుమార్‌లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోంది.