అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. జనవరిలో ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, ఆయన అనేక ముఖ్యమైన నియామకాలను కూడా ప్రకటించారు. ఇందులో బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE) బాధ్యతలు అప్పగించారు. మస్క్ ఎన్నికల్లో ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడంతోపాటు భారీగా డబ్బు కూడా ఖర్చు చేసిన విషయం తెలిసిందే.