Missing Case: కడప జిల్లా బద్వేల్ పట్టణంలో 7వ తరగతి విద్యార్థిని అదృశ్యం అయ్యింది. మూడు రోజులు గడచినా విద్యార్థిని ఆచూకీ తెలికపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బద్వేల్ మండలం ఉప్పత్తివారిపల్లె గ్రామానికి చెందిన గాజులపల్లె చిన్న వెంకట సుబ్బారెడ్డి రవణమ్మ కుమార్తె వెంకట సంజన బద్వేల్ పట్టణంలోని గోపిరెడ్డి స్కూలులో 7వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం స్కూలు నుంచి బయటకు వచ్చిన వెంకట సంజన తిరిగి స్కూల్‌కు వెళ్ళక పోవడంతో…