తెలుగులో ఈ యేడాది తొలి ప్రథమార్ధంలో వచ్చిన అనువాద చిత్రాలు ‘కేజీఎఫ్, విక్రమ్’ మంచి విజయం సాధించాయి. దాంతో మన నిర్మాతలు, పంపిణీదారుల దృష్టి పరభాషా చిత్రాల తెలుగు హక్కులపై పడింది. అలా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్, చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ హక్కులను సొంతం చేసుకున్నారు. తొలి నుండి ప్రయోగాత్మక చిత్రాలకు విక్రమ్ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాడు. అలానే దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తుకూ మంచి…